Friday, October 18, 2019

గణేశ పంచరత్నములు

గణేశ పంచరత్నములు 
▬▬▬▬▬▬▬▬▬▬▬

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కలాధరావతంసకం విలాసి లోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం ||

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ ||

సమస్త లోక శఙ్కరం నిరస్త దైత్య కున్జరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ||

అకిఞ్చనార్తి మర్జనం చిరన్తనోక్తి భాజనం
పురారిపూర్వనన్దనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపఞ్చనాశ భీషణం ధనఞ్జయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణవారణమ్ ||

నితాన్త కాన్త దన్తకాన్తిమన్తకాన్తకాత్మజం
అచిన్త్యరూపమన్తహీనమన్తరాయ కృన్తనమ్ |
హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం
తమేకదన్తమేకమేవ చిన్తయామి సన్తతమ్ ||

మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రగాయతి ప్రభాతకే హృదిస్మరన్ గణేస్వరం |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్ ||


 ۞۞۞۞۞۞۞۞

Thursday, October 17, 2019

దేవి స్తుతి

సుధాసింధోర్మ్యధ్యే సురవిటపివాటీపరివృత్తే 
మణిద్వీపే నీపొపవనవాతి చిన్తామణిగృహే 
శివాకారే మంచే పరమశివ పర్యజ్ఞ నిలయాం 
భజన్తి త్వాం  ధన్యాః కతిచన చిదానన్దలహరీమ్ 




తా. తల్లీ అమృత సముద్రమున కల్పవృక్షములతోపుల చేజుట్టబడిన రత్నపు లంకలో కమిడి చెట్ల తోటలు గల చింతామణులచే కట్టిన ఇంటిలో త్రికోణ రూపమగు తల్పమున సదాశివుని తొడయందున్న జ్ఞానానందతరంగమగు నిన్ను ధన్యులు కొందఱు సేవింతురు.  




విభూతి (భస్మము) తయారు చేయు పద్దతి 





ఆవుపేడను ముఠాలు (చిన్న చిన్న ఉండలు) గా చేసి, బాగా ఎండబెట్టాలి. ఎండిన తర్వాత, ఊక (వరి పొట్టు) తో ఆ ముఠాలు తెల్లబడే వరకు కాల్చాలి. తరువాత ఆ భస్మాన్ని మూడు రోజులు చంద్రుని వెన్నెలలో ఉంచాలి. అప్పుడు సరైన విభూతి తయారవుతుంది.